తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉత్తరాఖండ్​ విలయంపై దేశాధినేతల దిగ్భ్రాంతి - ఉప్పొంగిన ధౌలీగంగా

ఉత్తరాఖండ్‌ ధౌలీగంగా జల ప్రళయం మిగిల్చన మహా విషాదంపై పలువురు దేశాల అధినేతలు సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భారత్​.. ఎటువంటి సాయం కోరినా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

World expresses solidarity with India after glacial collapse in Uttarakhand
'ఎటువంటి సాయానికైనా సిద్ధం'

By

Published : Feb 8, 2021, 12:57 PM IST

ఉత్తరాఖండ్‌ జల ప్రళయం మిగిల్చిన తీవ్ర విషాదంపై పలువులు ప్రపంచస్థాయి నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయమై భారత్​కు ఎటువంటి సాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వరద బీభత్సంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఎవరేమన్నారు..?

భారత్​కు ఎటువంటి సాయం కావాలన్నా అందించేందుకు బ్రిటన్​ సిద్ధంగా ఉంది. బాధిత కుటుంబాలకు, సహాయ సిబ్బందికి నా సంఘీభావం తెలియజేస్తున్నా.

-బోరిస్​ జాన్సన్​, బ్రిటన్​ ప్రధాని

ఉత్తరాఖండ్​లో సంభవించిన వరదతో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వార్త పాకిస్థాన్ ప్రజలను కలిచివేసిందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జాహిద్​ హఫీజ్​ అన్నారు.

ఉత్తరాఖండ్​లో జరిగిన జల ప్రళయంలో ఎంతో మంది ఆచూకీ గల్లంతైంది. విలువైన ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. తప్పిపోయిన వారు జాగ్రత్తగా బయటపడాలని కోరుకుంటున్నా.

-జాహిద్​ హఫీజ్​, పాకిస్థాన్​ అధికార ప్రతినిధి

ధౌలీగంగా ఉప్పొంగిన కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది అమెరికా విదేశాంగ శాఖ. ఈ ఘటనలో గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్​ చేశారు. ఉత్తరాఖండ్​ వరదల్లో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మానుయేల్​ మేక్రాన్.

ఉత్తరాఖండ్​ వరదలపై విచారం వ్యక్తం చేశారు భూటాన్​ ప్రధాని లొటాయ్​ షేరింగ్.​ "వరదల్లో మరణించినవారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. గల్లంతైనవారు సురక్షితంగా బయటపడాలని ఆశిస్తున్నా. మిత్ర దేశం భారత్​కు అండగా ఉంటాం" అని అన్నారు.

ఉత్తరాఖండ్​లో భారీ వరద కారణంగా ఎంతో మంది మరణించారు అనే వార్త కలచి వేసిందని నేపాల్​ విదేశాంగ శాఖ పేర్కొంది.

ఇదీ చూడండి:170 కాదు.. 203 మంది గల్లంతు:సీఎం రావత్​

ABOUT THE AUTHOR

...view details