తెలంగాణ

telangana

ETV Bharat / international

బంపర్​ ఆఫర్​: లాటరీలో రూ.290కోట్ల జాక్​పాట్​ - 290 కోట్ల లాటరీ విజేత

జర్మనీకి చెందిన మహిళకు కలలో కూడా ఊహించని జాక్​పాట్​ తగిలింది. లాటరీలో 39 మిలియన్​ డాలర్లు (సుమారు రూ.290 కోట్ల 39 లక్షలు ) గెలుచుకుంది. ​

290 crore lottery
290 కోట్ల లాటరీ

By

Published : Jul 28, 2021, 8:43 PM IST

Updated : Jul 28, 2021, 9:22 PM IST

జర్మనీకి చెందిన ఓ మహిళను అదృష్టం వరించింది. లాటరీలో విజేతగా నిలిచిన ఆమెకు 39 మిలియన్​ డాలర్లు (రూ.290 కోట్లు) జాక్​పాట్​​ తగిలింది. జూన్​ 9న తీసిన డ్రాలో ఆమె ఒక్కరే విజేతగా నిలిచినట్లు లాటరీ అధికారులు తెలిపారు.

అయితే విషయం తెలియక.. ఆ టికెట్​ను తన హ్యండ్​ బ్యాగ్​లో ఉంచుకుని ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆ మహిళ తెలిపారు. లాటరీ తగిలిందని తెలియగానే షాక్​కు గురైనట్లు పేర్కొన్నారు.

"నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. 33 మిలియన్​ యూరోల విలువైన లాటరీ టికెట్​ను నా హ్యాండ్​ బ్యాగ్​లో ఉంచుకుని కొన్ని వారాలపాటు ఎంతో నిర్లక్ష్యంగా తిరిగాను. అయితే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. దీంతో నా కుటుంబం సంతోషంగా జీవిస్తుంది."

- లాటరీ విజేత

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, పర్యావరణం పరిరక్షణ కోసం ఈ డబ్బును ఉపయోగించాలని యోచిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మనసును తాకిన ప్రపోజల్.. ప్రియుడిపై ముద్దుల వర్షం​

Last Updated : Jul 28, 2021, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details