Woman received 4500 calls: ఉత్తర ఐర్లాండ్‌లో ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. ఆమె ఫోన్ నంబర్‌కు వరుసగా 4,500కు పైగా కాల్స్ రావడం వల్ల ఉక్కిరిబిక్కిరి అయింది. చివరకు ఓ చిన్న పొరపాటు వల్ల తనకు ఈ పరిస్థితి వచ్చిందని తెలిసి శాంతించింది.
వేల కాల్స్ వచ్చిన ఈ మహిళ పేరు హెలెన్ మెక్‌మోహన్. ఓ ప్రాథమిక చికిత్స శిక్షణా కేంద్రాన్ని నడుపుతోంది. ఉన్నట్టుండి ఆమె ఆఫీస్‌లోని ఫోన్‌కు వందల కాల్స్ రావడం మొదలైంది. ఎవరైనా శిక్షణ కోసం ఫోన్ చేస్తున్నారేమో అని భావించి ప్రతి కాల్‌కు హెలెన్ స్పందించింది. కానీ వారంతా వేరే విషయాలు అడుగుతున్నారు. వీళ్లంతా తనకు ఎందుకు కాల్ చేస్తున్నారో తెలుసుకునేందుకు తను రిసీవ్ చేసుకున్న ఓ నంబర్‌కు ఆమె తిరిగి ఫోన్ చేసింది. 'స్పెండ్ లోకల్ స్కీమ్' వారు తనకు ఈ నంబర్ ప్రకటనలో ఇచ్చారని ఆ వ్యక్తి హెలెన్‌కు చెప్పారు. ఆ వివరాలు తన మెయిల్‌కు పంపమని ఆమె అడిగింది. మొయిల్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న నంబర్ హెలెన్దే. స్పెండ్ లోకల్ స్కీమ్ వారు ఫోన్ నంబర్లో ఓ అంకెను తప్పుగా ప్రచురించడం వల్ల ఈ పొరపాటు జరిగింది. ఆ నంబర్ హెలెన్దే కావడం వల్ల ఆమెకు కుప్పకుప్పలుగా ఫోన్లు వచ్చాయి. విషయం తెలుసుకున్న స్పెండ్ లోకల్ స్కీమ్ వారు హెలెన్‌కు క్షమాపణలు చెప్పారు. పొరపాటు జరిగిందని ప్రాధేయపడ్డారు.
Northern ireland woman