తెలంగాణ

telangana

ETV Bharat / international

మాస్కు ధరించమంటే.. బట్టలు విప్పేసి యువతి హల్​చల్

మాస్కు ఉన్న వారికే ఐస్​క్రీమ్ విక్రయిస్తామని పార్లర్ సిబ్బంది చెప్పేసరికి ఓ యువతి.. ఏకంగా తన దుస్తులనే ముఖానికి మాస్కులా ధరించి షాక్ ఇచ్చింది. అర్ధనగ్నంగా స్టోర్​లో నిలబడింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ARGENTINA ICE CREAM
ARGENTINA ICE CREAM strippping

By

Published : Jan 5, 2022, 9:36 PM IST

Woman stripped for Ice cream: అర్జెంటీనాలో ఓ మహిళ మాస్కు లేకుండా ఐస్​క్రీమ్ స్టోర్​కు వచ్చి హల్​చల్ సృష్టించింది. మాస్కు లేనిదే ఐస్​క్రీమ్ విక్రయించేది లేదని సిబ్బంది చెప్పేసరికి.. తన బట్టలు విప్పేసి ముఖానికి ధరించింది. ఇదంతా ఐస్​క్రీమ్ పార్లర్​లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

పార్లర్​లోకి రాగానే.. మాస్కు పెట్టుకోవాలని యువతికి సిబ్బంది సూచించారు. అయితే, ఆమె మాత్రం వారికి గడుసుగా సమాధానం ఇచ్చింది. 'నా మాస్కు గురించి మీరు అడగొద్దు. నేను పెట్టుకుంటున్నా' అంటూ బదులిచ్చింది. తన శరీరంపై ధరించిన దుస్తులను తీసేసి ముఖానికి మాస్కులా పెట్టుకుంది.

యువతి చేసిన పనికి ఐస్​క్రీమ్ పార్లర్ సిబ్బంది నివ్వెరపోయారు. ఇలా ప్రవర్తించినందుకు ఐస్​క్రీమ్ విక్రయించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో కోపంతో ఊగిపోతూ స్టోర్ నుంచి బయటకు వెళ్లిపోయింది.

ఆ యువతి పది మంది స్నేహితులతో కలిసి వచ్చిందని స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. అందులో మాస్కు ధరించిన ఓ వ్యక్తి వచ్చి.. ఐస్​క్రీమ్​లు కొనుక్కొని వెళ్లారని తెలిపింది.

ఇదీ చదవండి:చైనాలో జనాభా సంక్షోభం- భారీగా తగ్గిన జననాలు

ABOUT THE AUTHOR

...view details