ప్రపంచ దేశాలు కరోనా సంక్షోభంతో అతలాకుతలం అవుతున్నాయి. వైరస్ భయాలను వీడి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా రాజకీయ, ఆర్థిక, సామాజిక, కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే జర్మనీలోని ఓ రాష్ట్రం వినూత్నంగా పార్లమెంట్ సమావేశం నిర్వహించింది.
కరోనా కాలంలో పార్లమెంట్ సమావేశం ఇలా... - lawmakers separated by acrylic glass boxes in Germany
కరోనా సంక్షోభం ఆరంభమైన తర్వాత... తొలిసారిగా జర్మనీ నార్త్ రైన్ వెస్ట్‌ఫాలియన్ రాష్ట్రం పార్లమెంట్ సమావేశం నిర్వహించింది. ప్రత్యేకమైన గాజుతో తయారు చేసిన పెట్టెల్లో చట్టసభ్యులు భేటీ అయ్యారు. వైరస్ భయంతోనే ఈ వినూత్న ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
గాజు పెట్టెల్లో పార్లమెంట్ సమావేశాలు
జర్మనీలో కరోనా వైరస్ సంక్షోభం మొదలైన తర్వాత తొలిసారిగా నార్త్ రైన్ వెస్ట్‌ఫాలియన్ రాష్ట్రంలోని డ్యూసెల్డార్ఫ్‌లో పార్లమెంట్ సమావేశం నిర్వహించారు. చట్ట సభ్యులు పక్కపక్క కుర్చీల్లోనే కూర్చున్నా భౌతికదూరం పాటించేలా ప్రత్యేకమైన యాక్రిలిక్ గాజు క్యాబిన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 240మంది చట్ట సభ్యులు 240 అద్దాల పెట్టెల మధ్య కూర్చుని వేర్వేరు అంశాలపై చర్చించారు.
ఇదీ చూడండి:ప్రధానికి షాక్- ప్రతిపక్ష పార్టీలోకి తమ్ముడు