తెలంగాణ

telangana

స్పెయిన్​ ప్రధాని సతీమణికి కరోనా పాజిటివ్​

రొమేనియా ప్రధాని, బ్రిటన్​ మంత్రి ఇలా వివిధ దేశాల ప్రజాప్రతినిధులు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. తాజాగా స్పెయిన్​ ప్రధాని భార్యకు కరోనా సోకినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇండోనేషియా ప్రభుత్వంలోని ఓ మంత్రి కూడా కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

By

Published : Mar 15, 2020, 8:16 AM IST

Published : Mar 15, 2020, 8:16 AM IST

Wife of Spanish PM Sanchez has coronavirus: PM's office
ప్రధాని సతీమణికి కరోనా వైరస్!

ప్రపంచ దేశాలకు ప్రస్తుతం ఇబ్బంది కలిగిస్తున్న అతిపెద్ద అంశం కరోనా వైరస్. ​చైనాలో తగ్గుముఖం పడుతూ మిగతా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. వివిధ దేశాల అధినేతలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. స్పెయిన్​ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్​ భార్యకు కరోనా వైరస్​ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాని, ఆయన భార్య బెగోనా గోమెజ్​ అధికారిక నివాసంలోనే కరోనా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

ఇండోనేషియా మంత్రికి..

ఇండోనేషియా మంత్రి బుడి కరియాకు కరోనా సోకినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. జకర్తాలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. పాఠశాలలకు సెలవులు సహా ఎక్కువమంది హాజరయ్యేందుకు అవకాశమున్న కార్యక్రమాలను నిలిపేస్తున్నట్లు ఇండోనేషియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి:డొనాల్డ్​ ట్రంప్​కు కరోనా వైరస్​ నెగటివ్​

ABOUT THE AUTHOR

...view details