తెలంగాణ

telangana

ETV Bharat / international

క్రీ.శ. 536... ఆ ఏడాది నరకం చూపించింది..

ఈ ఏడాది కరోనా మహమ్మారి రాకతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి కంటే భయానక స్థితిని 14 శతాబ్దంలోని ప్రజలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రపంచానికి వెలుగునిచ్చే ఆ సూర్యుడు కొన్ని రోజుల పాటు కనిపించలేదంటే నమ్మగలరా? మరీ ఆ భానుడు కనిపించకపోవటానికి గల కారణాలు ఏమిటీ? ఇంతకీ ఆ దేశ ప్రజలు ఎవరో తెలుసుకుందామా?

Why People Beleive A.D.536 Is A Year Of Hell
క్రీ.శ. 536... ఆ ఏడాది నరకం చూపించింది..

By

Published : Aug 12, 2020, 11:46 AM IST

2020.. ఎంతో ఆనందోత్సాహాలతో ప్రారంభమైంది.. కోట్లాదిమంది తమ భవిష్య ప్రణాళికలు రచించుకున్నారు... ఎన్నో ఆశలు.. అన్నీ కరోనా మహమ్మారి దెబ్బకు తలకిందులయ్యాయి. బతికుంటే చాలు అన్న విధంగా జీవితం మారింది. ఈ ఏడాది ఇలా మారడంపై అనేక మంది ఆవేదన చెందుతున్నారు. అయితే కొన్ని శతాబ్దాలకు ముందు ఒక ఏడాదిలో ప్రజలు పడిన కష్టాల్ని తలచుకుంటే ఇప్పుడు మన ముందు ఉన్నది చాలా చిన్న కష్టమే అని తెలుస్తుంది. అష్టకష్టాల ఏడాది క్రీ.శ. 536 ...

సూర్యుడు మాయమయ్యాడు..

ఆ ఏడాది ఐస్‌లాండ్‌లోని అగ్ని పర్వతం బద్దలయింది. మొత్తం ఐరోపాను ఇక్కడ నుంచి వెలువడిన బూడిద కప్పివేసింది. అనేక నెలల పాటు అగ్ని పర్వతం నుంచి పొగలు వస్తుండటంతో సూర్యకిరణాలు నేలపైకి ప్రసరించలేకపోయాయి. దీంతో వాతావరణ వైవిధ్యం తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం అప్పటి ప్రజలకు తెలియలేకపోవడం వల్ల ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ ఏడాది అంతా సూర్యుడు చంద్రుడిలాగా కనిపించాడు. ఉష్ణోగ్రతలు 1.5 సెల్సియస్‌ డిగ్రీల నుంచి 2.5 సెల్సియస్‌డిగ్రీలకు పడిపోయాయి. సుదూరంగా చైనాలో కూడా పంటలు నశించిపోయాయంటే అగ్నిపర్వత పేలుడు ఎంత తీవ్రంగా ఉందో ఊహించవచ్చు.

18 నెలలు.. పిట్టల్లా రాలిపోయారు..

దాదాపు 18 నెలలు సూర్యకాంతి ఐరోపా, ఆసియాలోని పలుదేశాలకు చేరలేదు. దీంతో పంటలు పండటం కష్టం కావడంతో ఆహార లభ్యత తక్కువగా ఉండేది. వేలమంది మనుషులు ఆకలితో ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో జంతువులు చనిపోయాయి.

మూడుగంటలే వెలుగు..

అప్పట్లో ప్రొకొపియస్‌ అనే బైజాంటిన్‌ చరిత్రకారుడు ఈ వైపరిత్యాన్ని గ్రంథస్తం చేశాడు. రోజులో మూడుగంటల పాటు మాత్రమే సూర్యుడు ఉండేవాడని అయితే ఆ కిరణాలు చంద్రుని నుంచి వచ్చినట్టు ఉండేవని పేర్కొన్నాడు. కనీసం పండ్లను కూడా చూడలేదని సిరియన్‌ చరిత్రకారుడు మైఖెల్‌ తన పుస్తకాల్లో వెల్లడించాడు..

మహమ్మారుల దాడి..

536 ఏడాది పూర్తయి 537 అడుగుపెట్టింది. ఈ సమయంలోనే ప్లేగు వ్యాధి వ్యాపించింది. కానిస్టాంటినోపుల్‌ నగరంలోనే తొలిమూడు రోజుల్లో 40 వేలమంది వరకు మృత్యువాత పడ్డారు. మొదట పేదలపై ఈ వ్యాధి దాడి చేసింది. అనంతరం ఇతర వర్గాల్లోనూ వ్యాధి వ్యాపించింది.

రోమన్‌ సామ్రాజ్య పతనానికి ఒక కారణం..

536 గడిచిన అనంతరం 537 చివరలో అగ్నిపర్వతం చల్లబడటం వల్ల లావా తగ్గిపోయింది. దీంతో తిరిగి సాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రజానీకం ఊపిరి పీల్చుకుంది. బైజాంటిన్‌ సామ్రాజ్యంలో దాదాపు 40 శాతం ప్రజలు మృత్యువాత పడ్డారు. రోమన్‌ సామ్రాజ్య విస్తరణకు అడ్డుకట్ట పడింది. అనంతరం కోలుకోలేక పతనమైంది.

ABOUT THE AUTHOR

...view details