తెలంగాణ

telangana

ETV Bharat / international

WHO: ఐరోపాకు 'డెల్టా వేరియంట్' ముప్పు - ఆల్ఫా డెల్టా వేరియంట్ శ్రీలంక

ఐరోపాలో డెల్టా వేరియంట్ విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. వ్యాక్సిన్లకు దీటుగా ఈ వేరియంట్ వ్యాపిస్తోందని పేర్కొంది. మరోవైపు, శ్రీలంకలోనూ ఆల్ఫా, డెల్టా వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి.

WHO warns delta variant taking hold in Europe
ఐరోపాకు 'డెల్టా' ముప్పు- టీకాలను ఎదుర్కొని వ్యాప్తి

By

Published : Jun 10, 2021, 10:56 PM IST

భారత్​లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్​పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఐరోపా విభాగం డైరెక్టర్ డాక్టర్ హాన్స్ క్లూగ ఆందోళన వ్యక్తం చేశారు. ఐరోపా దేశాల్లో ఈ వేరియంట్ విస్తృతంగా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు. కొన్ని రకాల వ్యాక్సిన్లను ఎదిరించి మరీ వైరస్ ప్రబలుతోందని అన్నారు. 60 ఏళ్లు పైబడిన జనాభా వైరస్​కు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెప్పారు.

మరోవైపు, ఆల్ఫా, డెల్టా కొవిడ్ వేరియంట్లు శ్రీలంకలో వెలుగుచూశాయి. తొమ్మిది వేర్వేరు ప్రదేశాల్లో వీటిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 80 మందికి ఆల్ఫా వేరియంట్ సోకగా.. క్వారంటైన్​లో ఉన్న ఒక వ్యక్తికి డెల్టా రకం కొవిడ్ సోకిందని చెప్పారు. రెండు డోసులు తీసుకున్న కొందరు వైద్య సిబ్బందిలోనూ డెల్టా కేసులు గుర్తించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:ఆ వయసు పిల్లలకు మాస్కు అవసరం లేదా?

ABOUT THE AUTHOR

...view details