కరోనా రోగులకు చికిత్స అందించేందుకు యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ను ఉపయోగించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మరోసారి స్పష్టం చేసింది. వ్యాధి తీవ్రత ఎంత ఉన్నా.. ఇది ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్ డెవలప్మెంట్ గ్రూప్ ప్యానెల్ తేల్చిచెప్పింది.
ఆస్పత్రుల్లో చేరిన దాదాపు 7 వేల మంది రోగులపై రెమ్డెసివిర్ ట్రయల్స్ నిర్వహించారు. అయితే.. వీరిలో రెమ్డెసివిర్ ఎలాంటి సానుకూల ప్రభావాలు చూపలేదని తేలినట్లు ప్యానెల్ తేల్చింది. మరణం నుంచి బయటపడేయడానికి ఈ మందు దోహదం చేయడం లేదని పేర్కొంది. సంబంధిత కథనం.. బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైంది.