కరోనా కట్టడికి భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాకు త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆగస్టు చివరి నాటికి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొవాగ్జిన్ టీకాకు సంబంధించిన ప్రీ-సబ్‌మిషన్ సమావేశాన్ని డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే పూర్తి చేసింది. డోసియర్‌ను ఆమోదించడంతో పాటు రోలింగ్ డేటా పరిశీలనను ఈ నెలలో ప్రారంభించింది. తుది నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉందని తెలిసింది.
వచ్చేనెలలో కొవాగ్జిన్ అనుమతిపై డబ్ల్యూహెచ్ఓ నిర్ణయం! - భారత్ బయోటెక్
కొవాగ్జిన్ టీకా అత్యవసర అనుమతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వచ్చే నెలలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓలో వ్యాక్సిన్లపై సహాయ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న మరియాంజెలా సిమావో తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ
తమ అధ్యయనంలో కొవాగ్జిన్ టీకా చాలా ముందస్తు దశలో ఉన్నట్లుగా తేలిందని, డబ్ల్యూహెచ్ఓలో వ్యాక్సిన్లపై సహాయ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న మరియాంజెలా సిమావో తెలిపారు. తమ అధ్యయనంలో కొవాగ్జిన్ టీకా చాలా ముందస్తు దశలో ఉన్నట్లుగా తేలిందని వెల్లడించారు. ఈ టీకా 78శాతం ప్రభావ వంతమైనదని భారతీయ శాస్త్రవేత్తలు తెలిపినట్లు వివరించారు.
ఇదీ చూడండి:ముక్కు ద్వారా ఇచ్చే టీకాతో కరోనా ఖతం!