కొవిడ్ టీకా కొవాగ్జిన్ వినియోగ అనుమతిపై తుది మదింపునకు గాను (Covaxin WHO Approval) భారత్ బయోటెక్ నుంచి 'అదనపు సమాచారం' అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సాంకేతిక సలహా బృందం నిర్ణయించింది. "ఈ వారాంతంలో భారత్ బయోటెక్ నుంచి అవసరమైన సమాచారం అందుతుందని సాంకేతిక సలహా బృందం భావిస్తోంది. ఈ మేరకు తుది మదింపునకు గాను నవంబరు 3 (బుధవారం)న తిరిగి సమావేశమవుతుంది" అని పీటీఐ అడిగిన ఓ ప్రశ్నకు డబ్ల్యూహెచ్‌ఓ మంగళవారం సమాధానం ఇచ్చింది.
'కొవాగ్జిన్' అనుమతిపై మరోసారి డబ్ల్యూహెచ్‌ఓ బృందం భేటీ
కరోనా టీకా కొవాగ్జిన్ (Covaxin News) వినియోగ అనుమతిపై.. తుది మదింపునకు భారత్ బయోటెక్ నుంచి మరింత అదనపు సమాచారం అవసరమని (Covaxin WHO Approval) డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక సలహా బృందం నిర్ణయించింది. ఈ వారాంతంలో ఈ సమాచారం తమకు అందుతుందని భావిస్తోంది.
కొవాగ్జిన్
అయితే అంతకుముందు డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి డాక్టర్ మార్గరెట్ హారిస్ విలేకరులతో మాట్లాడుతూ.. కొవాగ్జిన్‌కు (Covaxin News) అత్యవసర అనుమతిపై ఒకటి, రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు భారత్ బయోటెక్ రూపొందించిన 'కొవాగ్జిన్' టీకా అత్యవసర వినియోగ అనుమతికి సిఫార్సు చేసే విషయమై మంగళవారం డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక సలహా బృందం సమీక్ష నిర్వహించింది.
ఇదీ చూడండి:'కరోనా మహమ్మారికి ముకుతాడు.. భారత్ భేష్!'
Last Updated : Oct 27, 2021, 7:01 AM IST