కరోనా వైరస్ మహమ్మారి విషయంలో ప్రపంచం ప్రస్తుతం ఓ కీలక మలుపులో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ సమయంలో కొన్ని దేశాలు ప్రమాదకర మార్గంలో ప్రయాణిస్తున్నాయని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా దేశాల్లో ఆరోగ్య సేవల వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉందని ఆయన హెచ్చరించారు.
ముప్పు ముంగిట్లో ఆ దేశాలు- డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక - coronavirus news
కరోనా కొన్ని దేశాల్లో తగ్గుముఖం పడుతుంటే.. మరికొన్ని దేశాల్లో తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. రానున్న రోజులు మరింత కఠినంగా ఉండనున్నాయని తెలిపింది.
ప్రమాదం ముంగిట్లో ఆ దేశాలు..హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో
ప్రత్యేకించి ఉత్తరార్థ గోళంలో ఉన్న దేశాలు ప్రమాదం ముంగిట ఉన్నాయని అథనోమ్ వెల్లడించారు. మనం ఇంకా అక్టోబర్‌లోనే ఉన్నామని.. రానున్న కొద్ది నెలలు మరింత కఠినంగా ఉండనున్నాయని ఆయన వివరించారు. అయితే అనేక దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుదలతో ఆస్పత్రులు, అత్యవసర వైద్య సేవలు ఇప్పటికే కిక్కిరిసిపోయాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత ప్రాణ నష్టం జరగకుండా, ఆరోగ్య, విద్యా వ్యవస్థలు కుప్పకూలకుండా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా దేశాధినేతలను కోరారు.