ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు(corona cases globally) ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గత వారం కొవిడ్ గణాంకాలను విశ్లేషించి (corona cases who data) ఈ ప్రకటన విడుదల చేసింది. 31 లక్షలకు పైగా కొత్త కేసులు, 54,000 కొత్త మరణాలు నమోదైనట్లు తెలిపింది. అంతకుముందు వారంతో పోల్చితే ఇవి 9శాతం తక్కువ అని చెప్పింది. ఐరోపా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కేసులు, మరణాలు తగ్గినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వివరించింది.
- ఆఫ్రికాలో కరోనా కేసులు 43 శాతం తగ్గాయి.
- పశ్చిమాసియా, ఆగ్నేయాసియాలో 20 శాతం తగ్గుదల నమోదైంది.
- అమెరికా, పశ్చిమ పసిఫిక్‌లో 12 శాతం మేర తగ్గుముఖం పట్టాయి.
- ఆఫ్రికాలో మరణాలు తగ్గాయి.