ఐరోపాలో కరోనా తీవ్రరూపం దాల్చుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. గడిచిన వారంలో నమోదైన కొత్త కేసుల్లో సగం ఐరోపాలోనే వెలుగుచూశాయని పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ.
అంతకుముందు వారంతో పోల్చితే ఐరోపా దేశాల్లో కరోనా మరణాలు 46 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అమెరికాలోనూ కరోనా మృతుల సంఖ్య పెరిగిందని... అయితే అది కేవలం 2 శాతమేనని నివేదికలో పేర్కొంది.