కొన్ని వైరస్‌ల తరహాలో కాలానుగుణ మార్పులను కరోనా వైరస్ ప్రదర్శించట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఫలితంగా ఈ మహమ్మారిని నియంత్రించటం కష్టమని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగం సారథి మైఖేల్ రియాన్ అన్నారు.
"ప్రధానంగా శీతాకాలంలో వ్యాపించే ఇన్‌ఫ్లూయెంజా వంటి ఇతర శ్వాసకోశ సంబంధిత వైరస్‌లా కాకుండా కరోనా మహమ్మారి వేసవిలో వేగంగా సంక్రమించింది. అధిక ఉష్ణోగ్రత వద్ద కరోనా బతకదని కొంతమంది శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు చేసిన ముందస్తు అంచనాలు తప్పాయి" అని తెలిపారు మైఖేల్.