కరోనా టీకా కొనుగోలు కోసం ధనిక దేశాలు.. వాక్సిన్ తయారీ సంస్థలతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. ఒప్పందం పెట్టుకోవడం వల్ల ప్రపంచమంతటికీ టీకా ఇవ్వాలనే ఐక్యరాజ్యసమితి ఆశయం దెబ్బతింటుందని తెలిపింది.
ప్రస్తుతం ధనిక దేశాలు, సాధరణ ఆదాయం ఉన్న 42 దేశాలు.. కరోనా టీకాను కొనుగోలు చేయాలని చూస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (బ్ల్యూహెచ్ఓ) డెరక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అన్నారు. అవసరానికి మించి ఆ దేశాల దగ్గర టీకాలుంటే ఐక్యరాజ్య సమితికి ఇవ్వాలని కోరారు. తద్వారా మరిన్ని పేద దేశాలకు వాక్సిన్ను ఐక్యరాజ్య సమితి పంపిణీ చేయగలుగుతుందని వెల్లడించారు.
"కరోనా టీకా కొనుగోలుపై వాక్సిన్ తయారీ సంస్థలతో ధనికదేశాలు ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోవద్దని కోరుతున్నా. ఒక వేళ అలా జరిగితే వాక్సిన్ ధర పెరుగుతుంది. అంత ఖర్చు పెట్టి పేద దేశాలు టీకా కొనలేవు. దాంతో అందరికీ వాక్సిన్ ఇవ్వాలన్న ఐక్యరాజ్య సమితి ఆశయం దెబ్బతింటుంది."