తెలంగాణ

telangana

ETV Bharat / international

'ప్రపంచవ్యాప్తంగా 10శాతం పెరిగిన కరోనా కేసులు'

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) వెల్లడించింది. గత వారం 10 శాతం కేసులు పెరిగినట్లు పేర్కొంది. అమెరికా, యూరోప్ దేశాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నట్లు వివరించింది.

WHO reports 10% weekly rise in virus cases
'ప్రపంచవ్యాప్తంగా 10శాతం పెరిగిన కరోనా కేసులు'

By

Published : Mar 18, 2021, 5:22 AM IST

Updated : Mar 18, 2021, 5:59 AM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​-19 కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) వెల్లడించింది. వరుసగా మూడో వారం కేసులు అధికంగా నమోదవుతున్నాయని వివరించింది. గత వారం 10శాతం అధిక కేసులు పెరిగినట్లు పేర్కొంది. కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టిన కేసులు.. గత మూడు వారాల నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 80 శాతం కేసులు అమెరికా, యూరోప్ దేశాల్లోనే నమోదవుతున్నాయని వివరించింది.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ను చాలా దేశాలు తాత్కాలికంగా నిలిపివేసిన కారణంగా.. కేసుల సంఖ్య ఉద్ధృతమవుతోందని తెలిపింది. అయితే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ వల్ల రక్తం గడ్డ కడుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి :చైనా, హాంకాంగ్ అధికారులపై అమెరికా ఆంక్షలు

Last Updated : Mar 18, 2021, 5:59 AM IST

ABOUT THE AUTHOR

...view details