భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా కొవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతిపై తుది మదింపునకు గాను (Covaxin WHO Approval) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సాంకేతిక సలహా బృందం(టీఏజీ) నేడు మరోసారి భేటీ కానుంది. టీకాకు(Covaxin News) సంబంధించి అదనపు సమాచారం కావాలని ఇప్పటికే భారత్ బయోటెక్‌ను టీఏజీ కోరింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ అధికారి ఒకరు తెలిపారు.
"కొవాగ్జిన్ టీకాకు సంబంధించి, అక్టోబరు 26న టీఏజీ భేటీ అయింది. టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చే ప్రక్రియలో భాగంగా వ్యాక్సిన్ తయారీదారుల నుంచి అదనపు సమాచారాన్ని కోరింది. ఈ వ్యాక్సిన్ వినియోగం వల్ల కలిగే తుది ప్రమాదం, ప్రయోజనాలు తెలుసుకునేందుకు ఈ సమాచారం అవసరమవుతుంది."
-డబ్ల్యూహెచ్‌ఓ అధికారి.