తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచ దేశాలపై కరోనా పంజా- 7 రోజుల్లో 2 కోట్లకుపైగా కొత్త కేసులు

WHO On Omicron Virus: ఒక్కవారం వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా బలపడుతోందని హెచ్చరించింది. భారత్, నేపాల్, బంగ్లాదేశ్​లోనే అధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నట్లు వెల్లడించింది.

Covid-19
కరోనా

By

Published : Jan 26, 2022, 12:53 PM IST

Updated : Jan 26, 2022, 2:01 PM IST

WHO On Omicron Virus: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణపై కీలక విషయాలను వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ). గతవారంలో 2 కోట్ల 10 లక్షలకుపైగా కేసులు నమోదైనట్లు తెలిపింది. ఒక్క వారం వ్యవధిలోనే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం.. కరోనా ప్రబలినప్పటి నుంచి ఇదే మొదటిసారని ఆందోళన వ్యక్తం చేసింది.

ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా బలపడుతోందని హెచ్చరించింది. డెల్టా వేరియంట్​తో పోల్చితే.. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, శ్వాసనాళాలపై అధిక ప్రభావం చూపుతోందని తేలినట్లు పేర్కొంది. భారత్, నేపాల్, బంగ్లాదేశ్​లోనే అధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నట్లు వెల్లడించింది.

ఈ మేరకు 'కొవిడ్​-19 వీక్లీ ఎపిడెమియోలాజికల్ అప్డేట్' నివేదికను మంగళవారం విడుదల చేసింది. గతవారం(జనవరి 17-23) ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 5 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

వారం వ్యవధిలో 50వేల మరణాలు..

కరోనా ధాటికి వారం వ్యవధిలోనే కొత్తగా 50వేల మరణాలు సంభవించినట్లు డబ్ల్యూహెచ్​ఓ రిపోర్టులో పేర్కొంది. జనవరి 23 నాటికి ప్రపంచవ్యాప్తంగా 34 కోట్లకుపైగా కేసులు నమోదైనట్లు, 50లక్షలకుపైగా మరణాలు సంభవించినట్లు స్పష్టం చేసింది.

అనేక దేశాల్లో సామాజికవ్యాప్తి..

ఒమిక్రాన్​ వేరియంట్ కారణంగా చాలా దేశాల్లో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకున్నట్లు డబ్ల్యూహెచ్​ఓ నివేదికలో పేర్కొంది. గతేడాది నవంబర్, డిసెంబర్​లో అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో ప్రస్తుతం.. కరోనా వ్యాప్తి తగ్గినట్లు స్పష్టం చేసింది.

లక్షణాలు సున్నా.. కానీ..

డెల్టా వేరియంట్​తో పోల్చితే ఒమిక్రాన్ సోకినప్పుడు లక్షణాలు ఏవీ ఉండటం లేదని అధ్యయనాల్లో తేలింది. ఇదే విషయాన్ని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది. ఆగ్నేయాసియాలో గతవారంతో పోల్చితే 36శాతం కేసులు పెరిగినట్లు తెలిపింది. భారత్, నేపాల్, బంగ్లాదేశ్​లోనే అధిక సంఖ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయని.. మరణాలు కూడా ఈ దేశాల్లో గతంవారంతో పోల్చితే 44శాతం పెరిగినట్లు రిపోర్టులో పేర్కొంది డబ్ల్యూహెచ్​ఓ. ఈ దేశాల్లోనే కొత్తగా 3,700 మరణాలు సంభవించినట్లు తెలిపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 26, 2022, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details