కరోనాను ఎదుర్కొనే ప్రయత్నాల్లో భాగంగా సాంకేతికత సాయం తీసుకుంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). మహమ్మారి గురించి వైద్యులు, ప్రజలకు సమాచారం అందిచేందుకు రెండు ప్రత్యేకమైన మొబైల్ యాప్‌లను రూపొందించింది. వైద్య సిబ్బంది కోసం 'డబ్ల్యూహెచ్ఓ అకాడమీ', సామాన్యుల కోసం 'డబ్ల్యూహెచ్ఓ ఇన్ఫో' పేరుతో వాటిని ప్రవేశపెట్టింది.
డబ్ల్యూహెచ్ఓ అకాడమీ...
కొవిడ్-19 నుంచి రోగులను, తమను కాపాడుకునేందుకు కావాల్సిన నైపుణ్యాలు, శిక్షణ అందించేందుకు వైద్య సిబ్బందికి సాయపడునుందీ 'డబ్ల్యూహెచ్ఓ అకాడమీ' యాప్. ప్రతి నిమిషం వారికి మార్గనిర్దేశం చేస్తుంది. డబ్ల్యూహెచ్ఓ మహమ్మారిపై చేసిన పరిశోధనా సమాచారాన్ని.. ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంచనుంది. దీన్ని యాక్సెస్ చేయడానికి సామాన్యులకు అవకాశం ఉండదు.
"కరోనా వైరస్‌కు ఎదుర్కొవడానికి కావాల్సిన సమాచారం.. ప్రపంచంలో అన్ని మూలల ఉన్న వైద్యుల చేతుల్లో ఉంచేందుకు ఈ యాప్ తోడ్పడుతుంది."
-టెడ్రోస్ అధనోమ్, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్