తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా కట్టడిలో భారత్​ విధానాలు భేష్: డబ్ల్యూహెచ్​ఓ

కొవిడ్​-19 మహమ్మారిని కట్టడి చేయటంలో భారత్​ చేపడుతున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్​ఓ ప్రశంసించింది. లాక్​డౌన్​, అన్​లాక్​ విధానాలు వ్యవస్థీకృతంగా ఉన్నాయని.. ఇదే విధానాన్ని ప్రపంచ దేశాలు పాటించాలని సూచించింది.

By

Published : Jul 4, 2020, 7:42 PM IST

WHO lauds India's effort in COVID-19 fight
కరోనా కట్టడిలో భారత్​ విధానాలు భేష్: డబ్ల్యూహెచ్​ఓ

కరోనా కట్టడికి భారత్ చేపడుతున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ప్రశంసించింది. కొవిడ్‌-19ను గుర్తించడంలో వ్యాధినిర్ధరణ సౌకర్యాలను అభివృద్ధి చేసుకోవడాన్ని అభినందించింది.

భారత్‌కు జనాభానే అతిపెద్ద సవాల్‌ అన పేర్కొంది డబ్ల్యూహెచ్​ఓ. భౌగోళిక భిన్నత్వం కారణంగా కరోనా లాంటి మహమ్మారులు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు తెలిపింది. దేశంలో లాక్‌డౌన్‌ను ఒక క్రమపద్దతిలో ప్రవేశట్టారని... ప్రస్తుతం అమల్లో ఉన్న అన్‌లాక్‌ కూడా వ్యవస్థీకృతంగా ఉంది కొనియాడింది. ఇదే విధానాన్ని భారత్‌ సహా అనేక ప్రపంచ దేశాలు దీర్ఘకాలంలో కరోనా కట్టడికి పాటించాలంది.

డబ్ల్యూహెచ్​ఓ మార్గదర్శకాలను భారత్ బాగా పాటిస్తున్నట్లు ఆరోగ్య సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్ తెలిపారు.

" జనవరి నుంచి కరోనా పరీక్షల సామర్థ్యాన్ని భారత్‌ క్రమంగా పెంచుకుంది. ప్రస్తుతం రోజుకు 2 లక్షల వరకూ భారత్‌ కరోనా టెస్టులు చేస్తుంటడం ప్రశంసనీయం. కొద్ది నెలల్లోనే టెస్టింగ్‌ కిట్‌లను తయారు చేసుకోవడంలో భారత్ స్వాలంబన సాధించింది."

- డాక్టర్​ సౌమ్య స్వామినాథన్​, డబ్ల్యూహెచ్​ఓ సీనియర్​ శాస్త్రవేత్త

ABOUT THE AUTHOR

...view details