తెలంగాణ

telangana

ETV Bharat / international

'అలా చేయకపోతే ఐరోపాలో భారీ ప్రాణ నష్టం' - corona virus news

ఐరోపాలో మళ్లీ కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. చాలా దేశాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఐరోపావ్యాప్తంగా అన్ని దేశాలు మళ్లీ నిబంధనలను కఠినం చేస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకోకపోతే భారీ ప్రాణనష్టం తప్పదని డబ్ల్యూహెచ్​ఓ- ఐరోపా చీఫ్ హన్స్ క్లూగ్ హెచ్చరించారు.

VIRUS-WHO-EUROPE
ఐరోపా

By

Published : Oct 15, 2020, 6:58 PM IST

ఐరోపాలో కరోనా వైరస్ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. జర్మనీ, చెక్ రిపబ్లిక్, ఇటలీలో కేసుల పెరుగుదలను చూస్తే వైరస్ వ్యాప్తిని నియంత్రించే అవకాశాలు ఇప్పట్లో లేనట్లు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆయా దేశాల్లో మళ్లీ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.

వైరస్ కట్టడికి మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ఐరోపా విభాగం చీఫ్ డాక్టర్ హన్స్ క్లూగ్ అన్నారు. వైరస్ నియంత్రణలో దేశాలన్నీ ఎలాంటి రాజీ పడకూడదని సూచించారు. ఇళ్లు, ఇండోర్ ప్రాంతాల్లోనే వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు.

"95 శాతం మంది మాస్కులు ధరించి.. భౌతిక దూరాన్ని పాటించగలిగితే ఫిబ్రవరి నాటికి ఐరోపాలో 2.8 లక్షల మరణాలను నియంత్రించగలం. ఒక వేళ ఆంక్షలను సడలిస్తే ఐదు రెట్లు అధికంగా మరణాలు సంభవిస్తాయి. ఐరోపాలో వైరస్ విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. చిన్న చిన్న చర్యలతో సరిపెట్టడం తగదు."

- హన్స్ క్లూగ్​, డబ్ల్యూహెచ్​ఓ ఐరోపా విభాగం చీఫ్

వివిధ దేశాల్లో ఇలా..

  • ఐరోపాలో జనాభా పరంగా పెద్ద దేశమైన జర్మనీలో ప్రస్తుతానికి వైరస్​ కొంత అదుపులోనే ఉన్నా.. కేసులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా అక్కడ రికార్డు స్థాయిలో ఒకే రోజు 6,638 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చిలో గరిష్ఠంగా 6,300 కేసులే నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో సంక్రమణ అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిబంధనలను కఠినం చేయాలని జర్మనీ ఛాన్స్​లర్ ఏంజెలా మెర్కెల్ ఆదేశించారు.
  • చెక్​ రిపబ్లిక్​లో బుధవారం 9,544 కొత్త కేసులు వచ్చాయి. అక్టోబర్​ చివరి వారం వరకు దేశంలో ఆసుపత్రులు పూర్తిగా నిండే అవకాశం ఉంది.
  • ఫ్రాన్స్​లో వైరస్​ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో పారిస్ సహా 9 ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేయాలని అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆదేశించారు. కొత్త నిబంధనలపై పారిస్​లోని రెస్టారెంట్లు, సినిమా హాళ్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  • ఉత్తర ఇంగ్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల్లోనూ వ్యాపారులు కూడా ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. కానీ, కొత్త నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఐరోపా దేశాలు తమ ప్రజలను కోరుతున్నాయి.
  • కరోనా ప్రభావం తీవ్రంగా పడిన ఇటలీలో మళ్లీ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 7,332 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:చైనాలో మళ్లీ కరోనా- 90 లక్షల మందికి వైరస్​ పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details