తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరోపా​లో కోటి మార్క్​ను దాటిన కరోనా కేసులు - కొవిడ్​ అప్డేట్స్​

ప్రపంచ దేశాలపై కొవిడ్​ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు మొత్తం 4.53 కోట్ల మంది వైరస్​ బారినపడ్డారు. 11.85 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఐరోపాలో బాధితుల సంఖ్య కోటి మార్క్​ను దాటింది. అమెరికాలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.

WHO: Europe now has more than 10 million COVID-19 cases
యూరప్​లో కోటి మార్క్​ను దాటిన కరోనా కేసులు

By

Published : Oct 30, 2020, 10:05 AM IST

ప్రపంచంపై కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4కోట్ల 53లక్షల మందికిపైగా వైరస్​ సోకింది. వారిలో 11లక్షల 85వేల మందికిపైగా మృతిచెందారు. కొవిడ్​ బారినపడిన వారిలో ఇప్పటివరకు 3కోట్ల 29లక్షల మంది కోలుకున్నారు. 1.11 కోట్ల మంది చికిత్స పొందుతున్నారు.

ఐరోపా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటి మార్క్​ను దాటింది. మొత్తం 54 దేశాలలో ఈ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐరోపా ​ ప్రాంత డైరెక్టర్​ హన్స్​ క్లూగే చెప్పారు. గత వారంలోనే సుమారు 15లక్షల మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలిందని ఆయన అన్నారు. వైరస్​ వ్యాప్తికి ఐరోపా మరోసారి కేంద్ర బిందువుగా మారిందన్న క్లూగే.. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 30శాతం మరణాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.

  • కరోనా కేసుల పరంగా తొలి స్థానంలో ఉన్న అమెరికాలో వైరస్​ విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 91,530 మంది వైరస్​ బారినపడ్డారు. బాధితుల సంఖ్య 92లక్షల 12వేలు దాటింది. మరో 1,047 మరణాలతో.. మృతుల సంఖ్య 2.34లక్షలకు పెరిగింది.
  • బ్రెజిల్​లో వైరస్​ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. మరో 26వేలకుపైగా ​పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 55లక్షలకు చేరువైంది. కరోనా కారణంగా ఇప్పటివరకు అక్కడ 1.59లక్షల మంది చనిపోయారు.
  • ఫ్రాన్స్​లో గురువారం ఒక్కరోజే 47వేలకుపైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 12లక్షల 82వేలు దాటింది. ఇప్పటివరకు అక్కడ 36వేల 20మంది వైరస్​కు బలయ్యారు.
  • రెండో దఫా కరోనా విజృంభణతో వణికిపోతున్న ఫ్రాన్స్‌ మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. కొవిడ్ బాధితులతో ఆసుపత్రులన్నీ నిండిపోతుండటంతో..ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ బుధవారం ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సరికొత్త లాక్‌డౌన్‌తో వైరస్‌ను అదుపులోకి తీసుకురాగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబరు 1వ తేదీ వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది.
  • ఆ నిబంధనల ప్రకారం గురువారం రాత్రి నుంచి అక్కడ బార్లు, రెస్టారెంట్లు, అత్యవసరం కాని వ్యాపారాలు మూసివేయాల్సి ఉంది. అలాగే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే రాతపూర్వక అనుమతులు తీసుకోవడం తప్పనిసరి చేశారు
  • బ్రిటన్​లో మరో 23,065 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కేసుల సంఖ్య 9లక్షల 65వేల 340కు చేరింది.
  • ఇటలీలో మరోసారి కొవిడ్​ పంజా విసురుతోంది. మరో 26వేలకుపైగా కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 6.16 లక్షలు దాటింది. ఇప్పటివరకు అక్కడ 19,164 వైరస్​ మరణాలు నమోదయ్యాయి.
  • ఇరాన్​లో ఒక్కరోజులోనే 8వేలకుపైగా కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 6 లక్షలకు చేరువైంది. మరో 399 మంది మృతితో.. మరణాల సంఖ్య 34,113కు పెరిగింది.

ఇదీ చదవండి- ఉష్ణ ప్రయోగంతో కరోనా పనిపట్టే మాస్కు!

ABOUT THE AUTHOR

...view details