తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​ రకం కరోనా స్ట్రెయిన్​.. ఆందోళనకరం'

భారత్​లో ఉత్పరివర్తనం చెందిన బి-1617 రకం కరోనా వైరస్​ను ప్రపంచస్థాయిలో 'ఆందోళన కలిగించే వైరస్ రూపాంతరం' అని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ వేరియంట్​పై సమగ్ర అధ్యయనం కోసం మరింత సమాచారం సేకరించాల్సి ఉంటుందని తెలిపింది. ​

who
భారత్​ రకం కరోనా

By

Published : May 11, 2021, 5:30 AM IST

భారత్‌లో గుర్తించిన కరోనా కొత్త రకం వేరియంట్‌ బి-1617పై.. ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌ వేరియంట్‌ను విశ్లేషించిన పిదప ఇది 'ప్రపంచస్థాయి ఆందోళన కలిగించే వైరస్‌ రూపాంతరం'గా డబ్ల్యూహెచ్​ఓ కొవిడ్‌-19 టెక్నికల్‌ లీడ్‌కు చెందిన డాక్టర్‌ మరియా వాన్‌ కెర్​ఖోవ్​ పేర్కొన్నారు.

"బి-1617 వేరియంట్‌పై అంటువ్యాధుల నిపుణుల బృందం, డబ్ల్యూహెచ్​ఓ ల్యాబ్‌ బృందం చర్చింది. ప్రాథమిక స్థాయి అధ్యయనం మేరకు ప్రమాదకర వైరస్‌గా దీనిని గుర్తించాం."

-డాక్టర్​ మరియా వాన్​ కెర్​ఖోవ్​, డబ్ల్యుూహెచ్​ఓ

అయితే ఈ కొత్త మ్యూటెంట్‌ సమగ్ర అధ్యయనానికి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని డబ్ల్యూహెచ్​ఓ నిపుణుల బృందం అభిప్రాయపడింది. బి-1617 వేరియంట్‌ వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని భారత్‌తో పంచుకుంటున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా.. కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయన్న డబ్ల్యూహెచ్​ఓ.. వైరస్‌ వ్యాప్తిని, మరణాలను అడ్డుకునేందుకు పరిమిత సాధనాలతో శాయశక్తుల పనిచేస్తున్నట్లు చెప్పింది.

ఇదీ చూడండి:'ఐవర్​మెక్టిన్'​తో కరోనా నుంచి రక్ష!

ఇదీ చూడండి:కరోనా టీకా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి?

ABOUT THE AUTHOR

...view details