టీకాల కొరత వేధిస్తున్న నేపథ్యంలో పలు దేశాల్లో చేస్తున్న బూస్టర్ డోసుల (booster vaccine) పంపిణీని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది. సరిపడా డోసులు ఉన్న దేశాలు.. ఈ ఏడాది చివరి వరకు బూస్టర్ డోసుల పంపిణీని రద్దు చేయాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ పేర్కొన్నారు. పలు దేశాలు టీకాల కొరతతో సతమతమవుతుంటే తమ వద్ద బూస్టర్ డోసులకు (booster dose) సరిపడా వ్యాక్సిన్లు ఉన్నాయంటూ ఉత్పత్తి సంస్థలు ప్రకటించడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
'టీకాల పంపిణీని ప్రభావితం చేస్తున్న పలు సంస్థలు, దేశాలు ప్రదర్శిస్తున్న వైఖరి సరికాదు. పేదలు.. వారికి అందుతున్న దానితోనే తృప్తి చెందాలని అనుకుంటున్న ఆ సంస్థల వైఖరిని చూస్తూ ఉరుకోను' అని టెడ్రోస్ పేర్కొన్నారు.