తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా పునరాగమనంపై డబ్ల్యూహెచ్​ఓ హర్షం - US rejoins WHO membership

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లో సభ్యదేశంగా అమెరికా తిరిగి చేరడంపై హర్షం వ్యక్తం చేశారు ఆ సంస్థ డైరెక్టర్​ జరనల్​ టెడ్రోస్​ అథనోమ్​. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నిబద్ధతతో డబ్లూహెచ్​ఓలో చేరినందుకు బైడెన్​కు కృతజ్ఞతలు తెలిపారు​.

WHO chief thanks Biden for membership U-turn, US joining ACT Accelerator, COVAX
అమెరికా పునరాగమనంపై డబ్ల్యూహెచ్​ఓ హర్షం

By

Published : Jan 21, 2021, 8:29 PM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)తో అమెరికా తిరిగి జతకట్టడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్​ టెడ్రోస్ అథనోమ్​. ఈ నేపథ్యంలో అగ్రరాజ్య నూతన అధ్యక్షుడు జో బైడెన్​కు కృతజ్ఞతలు తెలిపారు.

"డబ్ల్యూహెచ్​ఓకు, ప్రపంచ ఆరోగ్యానికి ఇది మంచిరోజు. ప్రపంచంలో అమెరికా పాత్ర కీలకం. నిబద్ధతతో డబ్ల్యూహెచ్​ఓలో తిరిగి చేరినందుకు అధ్యక్షుడు బైడెన్​కు ధన్యవాదాలు. దీంతో కొవిడ్​ టీకా పంపిణీ, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటుంది."

-టెడ్రోస్​ అథనోమ్​ , డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​.

డబ్ల్యూహెచ్​ఓకు అన్ని విధాలుగా అమెరికా మద్దతు లభిస్తుందని ఉన్నతస్థాయి వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ వెల్లడించిన కొద్ది నిమిషాల్లోనే బైడెన్​కు.. అథనోమ్​ కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details