కనీసం కోటి కరోనా టీకా డోసులను పేద దేశాలకు అందించాలని సంపన్న దేశాలను కోరింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). దీంతో 2021లో తొలి వంద రోజుల్లోనే అన్ని దేశాలకూ వ్యాక్సిన్ పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది.
కొవాక్స్కు టీకా సరాఫరాల సమస్యల కారణంగా 20 దేశాలు ఇంకా తొలి వ్యాక్సిన్ కూడా అందించలేకపోయాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. టీకా ఉత్పత్తిని పెంచాలని తయారీదారులను ఆయన కోరారు. పేద దేశాలకు వ్యాక్సిన్ సాయం చేసే అవకాశం కలుగుతుందని చెప్పారు.