మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా,ఫైజర్-బయోఎన్‌టెక్, జాన్సన్&జాన్సన్ టీకాలకు అనుమతి లభించగా.. తాజా నిర్ణయంతో ఆ జాబితాలో చేరింది మోడెర్నా వ్యాక్సిన్. చైనాకు చెందిన సినోఫార్మ, సినోవాక్ వ్యాక్సిన్‌కు త్వరలోనే అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఎంఆర్ఎన్ఏ ఫార్మా సంస్థ నుంచి క్లినికల్ డేటా పొందడంలో జాప్యం కారణంగా టీకా అనుమతికి ఆలస్యం అయినట్లు డబ్ల్యూహెచ్ఓ వివరించింది.