స్పెయిన్లోని అట్లాంటిక్ మహాసముద్ర ఐలాండ్ లా పాల్మాలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది(volcano eruption). వారం రోజుల పాటు అంతర్గతంగా మార్పు జరిగిన తర్వాత.. విస్ఫోటనం చెందింది. ఉవ్వెత్తున ఎగిసిపడిన లావా.. సమీపంలోని ప్రాంతాలను కమ్మేసింది. లావా ధాటికి పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సముద్ర తీరం వరకు వచ్చే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం చేశారు అధికారులు.
లా పాల్మా ద్వీపం దక్షిణ ప్రాంతంలో అగ్నిపర్వతం విస్ఫోటనాన్ని(volcano eruption today) ముందుగా గుర్తించినట్లు కానరీ దీవుల అగ్నిపర్వత సంస్థ తెలిపింది. 50ఏళ్ల క్రితం 1971లో ఈ పర్వతం బద్దలైనట్లు(volcano eruption video) వెల్లడించింది. కుంబ్రే వైజా అగ్నిపర్వత శిఖరం నుంచి నల్లటి పొగతో కూడిన అగ్ని కనికలు ఎగిసిపడుతున్నట్లు పేర్కొంది. తాజా పరిస్థితులు, భూకంపాలు ఏర్పడటంపై శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు.
అగ్నిపర్వతం విస్ఫోటనానికి ముందు కబెజా డీ వాకా ప్రాంతంలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.