తెలంగాణ

telangana

ETV Bharat / international

ఈ ఏడాది నిరాడంబరంగా 'నోబెల్'​ ప్రదానోత్సవం - nobel peace prize 2020

కరోనా నేపథ్యంలో నోబెల్​ శాంతి బహుమతి-2020 ప్రదానం వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని నార్వేజియన్​ నోబెల్ ఇనిస్టిట్యూట్​ నిర్ణయించింది. వేదికను కూడా ఓస్లో సిటీ హాల్​ నుంచి ఓస్లో విశ్వవిద్యాలయానికి మార్చింది.

VIRUS-NOBEL
నోబెల్​ ప్రదానోత్సవం

By

Published : Sep 23, 2020, 9:14 AM IST

ఈ ఏడాది డిసెంబర్​ 10న జరిగే నోబెల్​ శాంతి బహుమతి ప్రదానం వేడుకలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. వేదికను కూడా ఓస్లో సిటీ హాల్​ నుంచి ఓస్లో విశ్వవిద్యాలయానికి మార్చినట్లు నార్వేజియన్ నోబెల్​ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

స్వీడన్​లోని స్టాక్​ హోంలో అదే రోజు భౌతిక, రసాయన, వైద్య, సాహిత్య రంగంలో బహుమతుల ప్రదానం జరగనుంది. ఈ వేడుకలనూ నిరాడంబరంగానే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

నోబెల్​ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్​ నోబెల్​ జయంతిని పురస్కరించుకుని 1901 నుంచి ఏటా డిసెంబర్​ 10న ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. శాంతి బహుమతిని ఓస్లోలో, మిగతా విభాగాల వేడుకలను స్టాక్​హోంలో నిర్వహిస్తారు. సాధారణంగా వెయ్యి మందిని ఈ వేడుకలను ఆహ్వానిస్తారు. అయితే, ఈ సారి ఆహుతులను వందకు కుదించారు.

ఈ ఏడాదికి గాను నోబెల్​ శాంతి బహుమతి విజేతను అక్టోబర్​ 9న ప్రకటించనున్నారు. మిగతా విభాగాల్లో విజేతలను అక్టోబర్​ 5-12 మధ్య వెల్లడిస్తారు.

ఇదీ చూడండి:'నోబెల్​ శాంతి బహుమతి' రేసులో ట్రంప్!

ABOUT THE AUTHOR

...view details