జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్, అమెరికా సంస్థ ఫైజర్ కలిసి రూపొందిస్తున్న వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను ఐరోపా సమాఖ్య(ఈయూ) కొనుగోలు చేయనున్నట్లు ఈయూ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ దీ లీయన్ తెలిపారు.
30కోట్ల టీకా డోసులను కొనుగోలు చేయనున్న ఈయూ
ఫైజర్-బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను ఐరోపా సమాఖ్య(ఈయూ) కొనుగోలు చేయనుంది.ఈ ఒప్పందంపై బుధవారం సంతకాలు చేయనున్నారు. ఈ టీకా అత్యంత మెరుగైన ఫలితాలను ఇస్తోందని ఈయూ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ దీ లీయన్ తెలిపారు.
30కోట్ల కరోనా టీకా డోసులను కొనుగోలు చేయనున్న ఈయూ
ఈయూ దేశాల కోసం దాదాపు 30కోట్ల టీకా డోసులను కొనుగోలు చేసేందుకు బుధవారం ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ 90శాతం కచ్చితమైన ఫలితాలను ఇస్తోందని వివరించారు. ఒక్కసారి విడుదలకాగానే.. దశల వారీగా టీకాలు అందజేస్తామన్నారు. వైద్య సిబ్బంది. వయోజనులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.