తెలంగాణ

telangana

ETV Bharat / international

వేర్పాటువాదులకు శిక్ష- భగ్గుమన్న స్పెయిన్​

స్పెయిన్​లో కాటలాన్​ వేర్పాటువాద నేతల ఆందోళనలు రెండోరోజూ కొనసాగాయి. కాటలాన్​ వేర్పాటువాద నేతలకు శిక్ష విధించడం వల్ల నిరసనలు మిన్నంటాయి. పలు ప్రాంతాల్లో ఘర్షణలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.

By

Published : Oct 16, 2019, 10:42 AM IST

Updated : Oct 16, 2019, 2:14 PM IST

వేర్పాటువాదులకు శిక్ష- భగ్గుమన్న స్పెయిన్​

వేర్పాటువాదులకు శిక్ష- భగ్గుమన్న స్పెయిన్​

నిరసనలతో స్పెయిన్​ దద్దరిల్లింది. వందలాది మంది ఆందోళనకారులు వరుసగా రెండోరోజు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలిపారు. పోలీసులు, వేర్పాటువాద కార్యకర్తల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది.

దేశద్రోహానికి పాల్పడ్డారన్న నేరంపై 12 మంది కాటలాన్ వేర్పాటువాద నేతలకు స్పానిష్‌ న్యాయస్థానం శిక్ష విధించడం వల్ల ఈ ఆందోళనలు ప్రారంభమయ్యయి. రెండేళ్ల పాటు జుడీషియల్‌ కస్టడీలో ఉన్న వారికి న్యాయస్థానం శిక్ష విధించడం.. కాటలోనియాలో చాలామంది ఆగ్రహానికి కారణమైంది.

కాటలోనియా​ ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాల్లో స్పెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పోలీసులే లక్ష్యంగా ఆందోళనకారులు పటాసులు, ఇతర వస్తువులు విసిరారు. బార్సిలోనాలో కాటలాన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. తమ ప్రాంతాన్ని వీడిపోవాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికెడ్లను కాల్చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు రబ్బరు బులెట్లను కాల్చారు పోలీసులు.

'తీవ్ర నష్టం కలిగించారు'

ఆందోళనకారులు సృష్టించిన విధ్వంసంతో తీవ్ర నష్టం కలిగిందని ప్రకటన విడుదల చేశారు స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్. కాటాలోనియాలో ప్రశాంత వాతావరణానికి నష్టం కలిగిస్తున్నారని నిరసనకారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: ఒక్క దరఖాస్తు చేస్తే.. 360 ఉత్తరాలొచ్చి పడ్డాయి!

Last Updated : Oct 16, 2019, 2:14 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details