ఆర్థిక నేరాల కింద వివిధ కేసులు ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్‌లో, భారత్‌లో కోర్టు ఖర్చులు భరించే నిమిత్తం న్యాయస్థానం(court) అధీనంలో ఉన్న నిధుల నుంచి కేటాయింపులు పెంచాలని కోరుతూ దాఖలు చేసిన అప్పీలును బ్రిటన్ కోర్టు బుధవారం నిరాకరించింది. 7 లక్షల 50వేల పౌండ్లు కావాలని కోరిన విజయ్ మాల్యా అందుకు తగ్గ రుజువులు చూపలేకపోయారని లండన్ హైకోర్టు జడ్జి(High Court judge) స్పష్టం చేశారు.
Vijay Mallya: విజయ్ మాల్యాకు కోర్టులో మళ్లీ మొండిచెయ్యి - విజయ్ మాల్యా అప్పీల్‌ను తోసిపుచ్చిన బ్రిటన్ ధర్మాసనం
కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా(vijay mallya) కు కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బ్రిటన్, భారత్‌లో కోర్టు ఖర్చులు భరించేందుకు న్యాయస్థానం పరిధిలో ఉన్న నిధులు(funds) విడుదల చేయాలన్న మాల్యా పిటిషన్‌ను తిరస్కరించింది.
విజయ్‌మాల్యాకు కోర్టులో మళ్లీ మొండిచెయ్యి
కోర్టు నిధుల నుంచి తన ఖర్చులతోపాటు కోర్టు ఖర్చులకు మాల్యా 11 లక్షల పౌండ్లు వాడుకునేందుకు న్యాయమూర్తి ఫిబ్రవరిలో అనుమతించారు. ఇప్పటికే గత వాయిదాలోనూ మాల్యాకు వ్యతిరేకంగా.. ఎస్బీఐ(sbi) నేతృత్వంలోని 13 భారతీయ బ్యాంకుల కూటమికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తదుపరి విచారణ జులై 26కు వాయిదా వేశారు.
ఇదీ చూడండి:బతుకు భారమై.. మెతుకు కరవై ఆటోకు నిప్పు!