తెలంగాణ

telangana

ETV Bharat / international

విజయ్ మాల్యాకు కోర్టులో మరో ఎదురుదెబ్బ - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్సార్టియం

భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణం తీసుకొని లండన్​ పరారైన విజయ్​ మాల్యా విషయంలో కీలక ముందడుగు పడింది. భారత్​లోని మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా ఎస్​బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్​పై లండన్ హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

Vijay Mallya
విజయ్ మాల్యా దివాళా పిటీషన్​

By

Published : May 18, 2021, 7:52 PM IST

Updated : May 18, 2021, 9:59 PM IST

భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి.. విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు లండన్​ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) నేతృత్వంలోని భారత బ్యాంకుల కన్సార్టియం కింగ్ ఫిషర్ ఎయిర్​లైన్స్​కు ఇచ్చిన రుణాలను వసూలు చేసేందుకు అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు బ్యాంకులు దాఖలు చేసిన దివాలా పిటిషన్​పై లండన్​లోని హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

బ్యాంకులు దాఖలు చేసిన దివాలా పిటిషన్​ సవరణ దరఖాస్తును సమర్థిస్తూ కంపెనీల దివాలా కోర్టు(ఐసీసీ) న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఈ తీర్పు అమలైతే భారత్​లోని మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఈ కేసులో తుదితీర్పు జులై 26న వెలువడనుంది.

Last Updated : May 18, 2021, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details