మనీలాండరింగ్, బ్యాంకు మోసాలకు పాల్పడిన కేసులలో విచారణ నిమిత్తం విజయ్ మాల్యాను భారత్కు అప్పగించాలని ఏప్రిల్ 20న తీర్పునిచ్చింది లండన్ హైకోర్టు. ఈ తీర్పును సమీక్షించాలని బ్రిటన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు మాల్యా. హైకోర్టు ఇచ్చిన రెండు వారాల గడువు ముగుస్తున్నందున ఈ మేరకు సుప్రీంను ఆశ్రయించాడు.
మాల్యా దాఖలు చేసిన అప్పీల్పై స్పందించేందుకు తమకు మే 14 వరకు సమయముందని భారత్ తరఫున ఈ కేసును వాదిస్తున్న బ్రిటన్ న్యాయవాది తెలిపారు.