తెలంగాణ

telangana

ETV Bharat / international

వెంటిలేషన్ వ్యవస్థ​ ద్వారా కరోనా వ్యాప్తి ముప్పు!

మీ ఇంటికి సరైన వెంటిలేషన్​ ఉందా? లేకుంటే మీరు కరోనా వైరస్​ బారిన పడే ప్రమాదం అధికంగా ఉందంటున్నారు కేంబ్రిడ్జ్​ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. ముఖ్యంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా ఇళ్లకే పరిమితయ్యే సమయంలో ఈ ప్రమాదం అధికమని తేల్చారు.

Ventilation systems
వెంటిలేషన్ వ్యవస్థ​ ద్వారా కరోనా వ్యాప్తి!

By

Published : Sep 30, 2020, 5:18 PM IST

Updated : Sep 30, 2020, 10:34 PM IST

ఇంటి లోపల ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉండేందుకు వెంటిలేషన్​ వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు. అయితే.. సరైన వెంటిలేషన్​ లేకుంటే కరోనా మహమ్మారి బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా చలికాలంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్న సమయంలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేలింది.

బ్రిటన్​కు చెందిన కేంబ్రిడ్జ్​ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. ఈ అధ్యయనం జర్నల్స్​ ఆఫ్​ ప్లూయిడ్​ మెకానిక్స్​లో ప్రచురితమైంది.

ఎక్కువగా వినియోగించే మిక్సింగ్​ వెంటిలేషన్​ ద్వారా వైరస్​ వ్యాప్తి అధికంగా ఉందని గుర్తించారు. ఈ వెంటిలేషన్​ వ్యవస్థ గాలిని గదుల్లో సమానంగా విస్తరించేలా చేస్తుందని.. అందులో ధూళి కణాలు, రేణువులు, ఏరోసోల్స్​, ముఖ్యంగా కరోనా మహమ్మారిని కలిగించే సార్స్​ కోవ్​-2 వంటి వైరస్​లు ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది నివేదిక. ప్రజలు దగ్గటం, తుమ్మడం, మాట్లాడటం, ఊపిరి తీసుకోవటం చేసిన క్రమంలో కరోనా వైరస్​ ప్రాథమికంగా గాలి ద్వారా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, వైరస్​ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించేందుకు సరైన వెంటిలేషన్ వ్యవస్థ​, మాస్క్​ ధరించడం అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఇప్పటివరకు చేపట్టిన పరిశోధనల ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లోని వైరస్​ వ్యాప్తి కంటే ఇంటి లోపలే వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని తేలింది.

"ఉత్తర అర్ధగోళంలో శీతకాలం సమీపిస్తున్నప్పుడు ప్రజలు ఇంటిలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. వైరస్​ సంక్రమించే ప్రమాదాన్ని అంచనా వేయటం, వ్యాప్తిని కట్టడి చేయటంలో వెంటిలేషన్​ పాత్ర కీలకం. శ్వాస వదిలినప్పుడు కార్బన్​ డయాక్సైడ్​తో పాటు వైరస్​ కలిగిన ఏరోసోల్స్​.. వెంటిలేషన్​ ద్వారా వచ్చే గాలితో గది మొత్తం వ్యాప్తిస్తాయి. సరైన వెంటిలేషన్​ లేకపోవటం వల్ల గదిలో కార్బన్​డయాక్సైడ్​ పెరిగిపోతుంది. అది వైరస్​ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది."

- పాల్​ లిండెన్​, సహరచయిత, కేంబ్రిడ్జ్​ విశ్వవిద్యాలయం.

భవనాల్లో గాలి వ్యాప్తి ప్రధానంగా మిక్సింగ్​ వెంటిలేషన్​ లేదా స్థానభ్రంశ వెంటిలేషన్​ ద్వారా సరైన రీతిలో ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రెండో వెంటిలేషన్​ అంశంలో వెంటిలేటర్లను గది కింది, పై భాగంలో బిగిస్తారు. దీని ద్వారా చల్లగాలి కింద నుంచి రాగా.. వేడిగాలి పైనుంచి వెళ్లిపోతుంది. శ్వాస వదిలినప్పుడు గాలి వేడిగా ఉంటుంది. అందులో చాలా వరకు గది పైభాగంలోకి చేరుతుంది. ఈ క్రమంలో సరైన రీతిలో వెంటిలేషన్​ ఉంటే ఇతరులు వదిలిన వేడి గాలి బయటకి వెళ్లిపోయి.. వైరస్ ముప్పును తగ్గిస్తుందని తెలిపారు శాస్త్రవేత్తలు.

ఇదీ చూడండి: 'ఎలా ఉన్నావ్?' నుంచి 'నోరు మూస్తావా' వరకు...

Last Updated : Sep 30, 2020, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details