వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను పోగెట్టేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం అద్భుతమైన వీడియో రూపొందించింది. అందరూ టీకాలు వేసుకుంటే దుకాణాలు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, స్టేడియాలు తెరుచుకుని మునుపటిలా సాధారణ జీవనం పొందవచ్చని చక్కగా వివరించింది. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. అప్లోడ్ చేసిన మూడు రోజుల్లోనే 3.3 మిలియన్ల మందికిపైగా దీన్ని వీక్షించారు. టీకా ఆవశ్యకతను గొప్పగా తెలియజేశారని కితాబిస్తున్నారు.
ఈ వీడియో చూస్తే టీకా కోసం క్యూ కడతారు!
వ్యాక్సినేషన్‌పై ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ రూపొందించిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. టీకా తీసుకుంటే మునుపటిలా సాధారణ పరిస్థితులు ఎలా వస్తాయో దృశ్య రూపంలో చక్కగా వివరించారు. ఒక్కో టీకాతో జీవితం పునర్ప్రారంభమవుతుందని దీనికి క్యాప్షన్ పెట్టారు.
ఈ వీడియో చూస్తే టీకా కోసం క్యూ కడతారు!
'ఒక్కో టీకాతో జీవితం పునర్ప్రారంభమవుతుంది. అందరూ త్వరగా వ్యాక్సిన్ వేయించుకోండి' అనే క్యాప్షన్‌ను ఈ వీడియోకు జోడించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో ఇది వైరల్ అయింది.