కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ తరుణంలో టీకాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
"యావత్ ప్రపంచం వ్యాక్సిన్ కోసం వేచిచూస్తోంది. ఒక్కసారి టీకా అందుబాటులోకి రాగానే వాటి పంపిణీ కోసం అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా దేశాధినేతల హామీ ఈ తరుణంలో అత్యవసరం."