చిన్నారులకు కరోనా టీకా వేయడం ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టిలో ప్రాధాన్యాంశం కాదని డబ్ల్యూహెచ్ఓ వ్యాక్సిన్ నిపుణురాలు కేట్ ఓ బ్రైన్ తెలిపారు. చిన్న పిల్లలపై మహమ్మారి ప్రభావం అంత తీవ్రంగా ఉండదని.. ప్రాణాంతం కూడా కాదని పేర్కొన్నారు.
పిల్లలను పాఠశాలలకు పంపే ముందే వ్యాక్సినేట్ చేయడం కూడా అత్యవసరం ఏమీ కాదన్న కేట్.. వాళ్లను పాఠశాలలో చూసుకునే సిబ్బందికి, ఉపాధ్యాయులకు ఇవ్వడం మంచి ఆలోచనని అన్నారు.