తెలంగాణ

telangana

ETV Bharat / international

దేశ ప్రజలంతా విధిగా మాస్కులు ధరిస్తే ఇంతే... - మాస్కులు

కరోనా మహమ్మారి దెబ్బకు ఐరోపా గజగజలాడుతోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ... అదే ఐరోపాలో ఉన్న చెక్​ రిపబ్లిక్​ అనే చిన్న దేశంలో మాత్రం కరోనా తీవ్రత చాలా తక్కువ. ఎందుకిలా?

Usage of masks "flattened" growth of coronavirus cases in Czech Republic
ఆ దేశంలో విధిగా మాస్కులు వాడి మహమ్మారికి అడ్డుకట్ట

By

Published : Mar 29, 2020, 7:26 PM IST

9 మరణాలు... 2,422 కేసులు... 1.06 కోట్ల మంది జనాభా ఉన్న చెక్​ రిపబ్లిక్​లో శుక్రవారం నాటికి కరోనా మహమ్మారి తీవ్రత ఇది. ఇతర ఐరోపా దేశాలతో పోల్చితే ఈ సంఖ్య చాలాచాలా తక్కువ. దేశ ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్​ ధరించాలన్న నిబంధన అమలు చేయడమే ఇందుకు కారణమంటున్నారు పరిశోధకులు.

10 రోజుల్లోనే...

ఐరోపా దేశాల్లో కొవిడ్​-19 వ్యాప్తి ఎక్కువగా ఉండడం వల్ల చెక్​ రిపబ్లిక్​ ప్రభుత్వం కాస్త కఠిన ఆంక్షలు విధించింది. ఇంటి నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్​లు, స్కార్ఫ్​లు ధరించాలని ఆదేశించింది. ఈ నిబంధనను మార్చి 18 నుంచి అమలు చేసింది.

"కరోనా కేసులు చెక్​ రిపబ్లిక్​ దేశంలో అదుపులో ఉండటానికి ముఖ్య కారణం ఇంట్లో తయారు చేసిన మాస్కులు వాడటమే. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించారు. కేవలం పది రోజుల్లోనే ఈ మాస్కులను వంద శాతం మంది వాడారు. పాత టీ షర్టులు, ఇతర వస్త్రాలతో మాస్కులను తయారు చేసుకున్నారు. "

-జెరెమీ హూవార్డ్​, డేటా సైంటిస్ట్​

లాక్​డౌన్ లేనప్పటికీ...

కొవిడ్ 19 ను అడ్డుకునేందుకు దక్షిణ కొరియా, జపాన్​, తైవాన్​ దేశాల్లో ఇప్పటి వరకు ఎటువంటి లాక్​డౌన్​లు విధించలేదు. కానీ ఈ దేశాల్లో కరోనా వైరస్ అదుపులో ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఆయా దేశాల్లో విరివిగా మాస్కులు ధరించడమేని అంటున్నారు పరిశోధకులు.

ఇదీ చదవండి:గర్భిణికి కరోనా సోకితే.. పుట్టే బిడ్డ పరిస్థితి ఏంటి?

ABOUT THE AUTHOR

...view details