ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఘనంగా ప్రారంభమైంది. 72వ ఏడాది జరుగుతున్న ఈ సినిమా సంబరానికి ఫ్రాన్స్‌లోని కేన్స్ నగరం వేదికైంది. జిమ్ జర్ముస్క్ దర్శకత్వం వహించిన 'ద డెడ్ డోంట్ డై' చిత్రాన్ని ప్రారంభ చిత్రంగా ప్రదర్శించారు. ఈ సినిమాలో నటించిన టిల్డా స్విన్టన్, బిల్ ముర్రే, ఆడమ్ డ్రైవర్, సెలెనా గొమేజ్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేశారు.
తొలి రోజున జేవియర్ బార్డెమ్, జూలియాన్నే మూర్, ఈవా లాంగోరియా రెడ్ కార్పెట్‌పై నడుస్తూ హొయలొలికించారు.
ఈ ఏడు జ్యూరీకి మెక్సికోకు చెందిన దర్శకుడు అలెగ్జాండ్రో గొంజాలెజ్ ఇనారిటు నేతృత్వం వహిస్తున్నారు. జ్యూరీ సభ్యులుగా ఎల్లె ఫాన్నింగ్, యోర్గోస్ లాంతీమోస్ ఉన్నారు.
మొత్తం 12 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినీ ప్రదర్శన మే 25వరకు కొనసాగనుంది. మొత్తంగా 19 చిత్రాలు ఈ ఏడాది ప్రదర్శనకు ఎంపికయ్యాయి. 2010 నుంచి భారత చిత్రాలు కేన్స్‌లో ప్రదర్శనకు ఎంపికవుతూ వస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం భారత చిత్రమేదీ ప్రదర్శనకు ఎంపిక కాలేదు.
'కేన్స్' సినీ సంబరానికి అదిరే ఆరంభం ఇదీ చూడండి: 'బిగ్ బీ' కామెడీ పంచ్‌లకు మీరు సిద్ధమా..?