చెట్లు సాధారణంగా పొడుగ్గా ఎదుగుతాయి. ఒక్కోసారి కొన్ని వృక్షాలు వంకరగా విభిన్న ఆకృతుల్లో కనిపిస్తాయి. వాటిని చాలా వింతగా చూస్తాం. అలాంటివన్నీ ఒకే అడవిలో ఉంటే ఆశ్చర్యపోవాల్సిందే కదా. అదే పోలాండ్లోని క్రూక్డ్ ఫారెస్ట్.
క్రూక్డ్ ఫారెస్ట్ పోలాండ్లోని గ్రిఫినో పట్టణానికి దగ్గర్లో ఉంది. ఈ అడవిలో దాదాపు 400 పైన్ చెట్లు ఉంటాయి. ఇవన్నీ పొడుగ్గా ఉండకుండా వంకరగా 'రివర్స్ క్వశ్చన్ మార్క్' ఆకారంలో ఉంటాయి. వీటిని 1930 ప్రాంతంలో నాటారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చెట్లు ఇలా వంగడం వెనక కారణమైతే ఇప్పటికీ తెలియదు.
పోలాండ్లోని క్రూక్డ్ ఫారెస్ట్.
ఫర్నిచర్‌కు ఉపయోగపడతాయని కావాలనే మొక్కలుగా ఉన్నప్పుడు ఇలా వంచేసి ఉంటారని కొందరు అంటే.. మరికొందరేమో మంచు తుపానుల కారణంగా ఇలా వంగిపోయాయని చెబుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ ట్యాంకులు చెట్లకు తగలడం వల్ల చెట్లన్నీ వంపుగా మారాయని కొందరు వాదిస్తే.. ఈ ప్రాంతంలో గురుత్వాకర్షణ శక్తి ప్రభావం విభిన్నంగా ఉండడమే కారణమని మరొకరు బదులిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ అడవిలోని చెట్లు ఇలా వింతగా ఉండటం వల్ల పర్యటకంగా ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.
ఇదీ చూడండి: లావా లావా.. నీలం రంగులో ఉన్నావా?