తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా వేళ భారీగా పెరిగిన డ్రగ్స్​ వినియోగం! - ఐరాస ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ప్రపంచ డ్రగ్స్ న్యూస్ ఆన్​లైన్

గతేడాది ప్రపంచవ్యాప్తంగా 27.5 కోట్ల మంది మాదకద్రవ్యాలను ఉపయోగించినట్లు ఐరాస వార్షిక నివేదిక వెల్లడించింది. కరోనా సమయంలో డ్రగ్స్​ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరిగినట్లు తెలిపింది.

UN: 275 million people used drugs worldwide in 2020
2020లో ఎంతమంది డ్రగ్స్ వినియోగించారో తెలుసా?

By

Published : Jun 25, 2021, 12:41 PM IST

2020లో ప్రపంచవ్యాప్తంగా 275 మిలియన్ల మంది మాదకద్రవ్యాలను వినియోగించారని ఐక్యరాజ్య సమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ విభాగం (యూఎన్​ఓడీసీ) నివేదిక తెలిపింది. వాటి వల్ల 3.6కోట్ల(13 శాతం) మంది ప్రజలు అనారోగ్యానికి గురైనట్లు వెల్లడించింది.

కరోనా సంక్షోభం సమయంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం వీపరీతంగా పెరిగిపోయినట్లు తేలింది. సుమారు 77 దేశాల్లో ఆరోగ్య నిపుణులు సర్వే చేపట్టారు. ఆయా దేశాల్లో మత్తు పదార్థాల వినియోగం పెరిగిందని.. 42 శాతం మంది తెలిపారు. అలాగే.. వైద్యానికి వినియోగించని ఫార్మా డ్రగ్స్​ వాడకమూ పెరిగినట్లు తేలింది.

యూఎన్​ఓడీసీ-2021 నివేదిక ప్రకారం..

  • కొన్ని ప్రాంతాల్లో గంజాయి వినియోగం గత 24 ఏళ్లలో నాలుగు రెట్లు పెరిగింది. అదే సమయంలో 40శాతం మంది యువత మాత్రమే దీనిని హానికరంగా భావిస్తున్నారు.
  • 15-64 మధ్య వయస్సుల వారిలో 5.5 శాతం మంది గతేడాది ఒక్కసారైనా డ్రగ్స్ వినియోగించారు.
  • ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్లకు పైగా ప్రజలు డ్రగ్స్​ను తీసుకుంటున్నారు. వీరిలో సగం మంది.. మాదకద్రవ్యాల విపరీత వినియోగంతో వచ్చే వ్యాధి 'హెపటైటిస్-సీ'తో బాధపడుతున్నారు.

" అవగాహన లేమితోనే మాదకద్రవ్యాల వాడకం పెరిగిపోతోంది. వాటితో కలిగే దుష్ప్రభావాలపై యువతకు అవగాహన కల్పించాలి. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు అవగాహన, వాస్తవికత మధ్య సంయమనం అవసరం."

-గడా వాలీ, యూఎన్​ఓడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details