12-15 సంవత్సరాల పిల్లలకు ఫైజర్ టీకాను అందించేందుకు బ్రిటన్ ఆరోగ్య నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు బ్రిటన్ ఆరోగ్య, సామాజిక సంరక్షణ విభాగం తెలిపింది.
12-15 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలపై ఫైజర్ జరిపిన క్లినికల్ ట్రయల్స్ డేటాను క్షుణ్నంగా పరిశీలించినట్లు యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ అధికారి జాన్ రైన్ వెల్లడించారు. వ్యాక్సిన్ సురక్షితమే కాక.. ప్రభావవంతమైనదని, పిల్లలకు మహమ్మారి ముప్పును తప్పిస్తుందని నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు.
ఆ దేశాల్లో ఇప్పటికే..