తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరాసలో రష్యా వ్యతిరేక ఓటింగ్​కు మరోసారి భారత్ దూరం

UNGA voting against Russia: ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఓటింగ్​కు భారత్ మరోసారి దూరమైంది. మొత్తం 141 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటేశాయి. 5 మంది రష్యాకు మద్దతు ప్రకటించాయి. 35 దేశాలు ఓటింగ్​కు దూరంగా ఉన్నాయి.

unga voting against
unga voting against

By

Published : Mar 2, 2022, 10:57 PM IST

UNGA voting against Russia: ఉక్రెయిన్ విషయంలో ఐరాసలో జరిగిన ఓటింగ్​కు భారత్ మరోసారి దూరమైంది. రష్యాకు వ్యతిరేకంగా ఐరాస జనరల్ అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్​లో 141 దేశాలు మద్దతు పలికాయి. 5 దేశాలు వ్యతిరేకించాయి. భారత్ సహా 35 దేశాలు ఓటింగ్​కు పూర్తిగా దూరంగా ఉన్నాయి.

ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై తటస్థంగా వ్యవహరిస్తున్న భారత్.. ఎవరికీ ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడం లేదు. ఇరుపక్షాలు శాంతియుత మార్గాన్ని పాటించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు దూరంగా ఉంటోంది. ఇటీవల ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలపై ఓటింగ్​కూ భారత్ దూరంగానే ఉంది.

ఇదీ చదవండి:యుద్ధ ప్రాతిపదికన పౌరుల తరలింపు... పాస్​పోర్ట్ లేకున్నా..

ABOUT THE AUTHOR

...view details