ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా ఆంటోనియో గుటెరస్ మరోసారి ఎన్నికకానున్నారు. ఈ మేరకు ఐరాస భద్రతా మండలి గుటెరస్ పేరును సిఫార్సు చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మరో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. ఇందుకు సంబంధించి 15 దేశాల మండలి గుటెరస్ పేరును ఏక్రగ్రీవంగా ఆమోదించింది.
ఐరాస సెక్రటరీ జనరల్‌గా గుటెరస్‌కు మరోదఫా అవకాశం! - సెక్రెటరీ జనరల్‌గా గుటెరస్
ఐరాస సెక్రటరీ జనరల్‌గా మరోసారి గుటెరస్‌కు మరోసారి అవకాశం కల్పించింది భద్రతా మండలి.
ఆంటోనియో గుటెరస్
గుటెరస్ రెండోసారి ఎన్నికను భారత్ స్వాగతించింది. ఈ మేరకు భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి ట్వీట్ చేశారు. ఏప్రిల్‌లోనే గుటెరస్ అభ్యర్థిత్వానికి భారత్ తన మద్దతు తెలిపింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఆయన్ను కలుకున్న విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రపంచ అత్యున్నత దౌత్యవేత్తగా గుటెరస్‌ను కొనియాడారు.
Last Updated : Jun 8, 2021, 9:53 PM IST