తెలంగాణ

telangana

ETV Bharat / international

పేద దేశాలకు 50 కోట్ల మోడెర్నా టీకా డోసులు! - ఐక్యరాజ్యసమితితో ఒప్పందం కుదుర్చుకున్న మోడెర్నా

అమెరికాకు చెందిన ప్రముఖ టీకా ఉత్పత్తి సంస్థ మోడెర్నా.. ఐక్యరాజ్యసమితి మద్దతు సంస్థ గావితో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. నాలుగో త్రైమాసికం తరువాత సుమారు 50 కోట్ల కరోనా టీకా డోసులను సరఫరా చేయనున్నట్లు తెలిపింది.

UN, Moderna
ఐక్యరాజ్య సమితితో మోడెర్నా భారీ టీకా ఒప్పందం

By

Published : May 3, 2021, 8:23 PM IST

అల్పాదాయ దేశాలకు 50 కోట్ల​ టీకా డోసులను సరఫరా చేసేందుకు ఐక్యరాజ్య సమితి నేతృత్వంలోని అంతర్జాతీయ టీకా కూటమి-గావితో ఒప్పందం కుదుర్చుకుంది మోడెర్నా. అయితే.. నాలుగో త్రైమాసికం తరువాతే టీకాల ఎగుమతులు ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది.

మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చిన మరుసటి రోజే ఈ ఒప్పందం చేసుకోవడం విశేషం.

కొవాక్స్​(సీఓవీఏఎక్స్​) పేరుతో పేద దేశాలకు టీకాలను అందిస్తోంది.. గావి. ఇందుకుగానూ టీకాల తయారీదారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. అదే సమయంలో పెద్దమొత్తంలో టీకాలను సొంతం చేసుకున్న ధనిక దేశాల నుంచి పేద దేశాలకు ఉచితంగా ఇప్పించేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే స్వీడన్​ ప్రభుత్వం ఒక మిలియన్​ ఆస్ట్రాజెనె​కా డోసులను కొవాక్స్​కు అందించినట్లు గావి తెలిపింది. అయితే తాజా ఒప్పందంతో 500 మిలియన్​ డోసులను మోడెర్నా నుంచి పొందనుంది.

మోడెర్నా ఇప్పటికే అనేక ధనిక దేశాలతో టీకాలు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో.. కొవాక్స్​కు ఆలస్యం కానుంది.

ఇదీ చూడండి:మోడెర్నా టీకాకు డబ్ల్యూహెచ్​ఓ పచ్చ జెండా

ABOUT THE AUTHOR

...view details