ప్రపంచవ్యాప్తంగా గడిచిన వారంలో 20 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి స్వల్పకాలంలో భారీ సంఖ్యలో కేసులు నమోదవడం గమనార్హం. అత్యధికంగా ఐరోపా 13 లక్షల పైగా కొవిడ్ కేసులు బయటపడగా... ఇవి ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో 46 శాతమని అధికారులు తెలిపారు.
అత్యధిక వైరస్ మరణాలు కూడా ఐరోపాలోనే వెలుగుచూస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. గత వారంతో పోల్చుకుంటే 35శాతం కొవిడ్ మరణాలు పెరిగినట్లు వెల్లడించింది. అయితే తొలిదశతో పోల్చుకుంటే కరోనా మరణాలు పాక్షికంగా తగ్గాయని పేర్కొంది.