భారత్‌లోని సీరమ్ సంస్థ నుంచి 9 కోట్ల కరోనా టీకా డోసుల సరఫరాలో జాప్యం జరిగిందని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని 'గవీ-కొవాక్స్' గురువారం ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టీకా అందించే కార్యక్రమంపై తీవ్ర ప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తం చేసింది.
భారత్‌లో వైరస్ కేసులు పెరగడమే అందుకు కారణంగా పేర్కొంది కొవాక్స్. కేసుల పెరుగుదలతో దేశీయ డిమాండ్ పెరగటం వల్ల ఎగుమతులపై ప్రభావం చూపినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో.. మార్చి నెలలో 4కోట్లు, ఏప్రిల్‌లో 5కోట్ల డోసుల సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించింది.
గవీ-కొవాక్స్ అనేది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద పేద దేశాలకు టీకా పంపిణీ కోసం ఏర్పడిన సమాఖ్య. ఈ కొవాక్స్ కార్యక్రమంలో భాగంగా గవీ.. ఈ ఏడాది మార్చి నాటికి 8 కోట్ల డోసులను పంపిణీ చేయాలని నిశ్చయించింది. డోసుల సరఫరా జాప్యం దానిపై ప్రభావం చూపనుంది.
భారత్‌పై ప్రశంసలు..