కరోనా ముప్పు అధికంగా ఉండే భవన అంతర్గత ప్రదేశాలను అతినీలలోహిత కిరణాల ద్వారా సురక్షితంగా ఉంచుకోవచ్చని తాజా పరిశోధనలో రూఢి అయింది. ముఖ్యంగా ఆసుపత్రుల్లో మహమ్మారి వ్యాపించకుండా ఈ విధానం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. బ్రిటన్లోని క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధన వివరాలను 'సైంటిఫిక్ రిపోర్ట్స్' పత్రిక అందించింది.
కరోనా వైరస్ తలెత్తిన తర్వాత గృహాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు వంటి భవనాల్లో తలుపులు, కిటికీలను బాగా తెరిచి ఉంచాలని నిపుణులు సూచించారు. అయితే.. గదుల్లోనూ, అక్కడి వస్తువులపైనా తిష్ఠవేసిన వైరస్ను ఎలా అంతమొందించాలన్నది పెద్ద సమస్యగా మారింది. దీనిపై పరిశోధన సాగించిన శాస్త్రవేత్తలు.. సురక్షితమైన అతినీల లోహిత కిరణాల(యూవీసీ) ద్వారా దీన్ని నాశనం చేయవచ్చని నిరూపించారు.